Site icon NTV Telugu

సింహాలను మీరెప్పుడైనా ఇంత ద‌గ్గ‌ర‌గా చూశారా?

సింహాల‌ను చూడాల‌ని అంద‌రికీ ఉంటుంది.  జూకి వెళ్లి చూస్తాం.  అయితే, అది ఎక్క‌డో దూరంగా ఉంటుంది.  దానిని ఫొటోలు తీసుకొని సంతోషిస్తాం.  ద‌గ్గ‌రగా చూడాలంటే సింహాల సంర‌క్ష‌ణా కేంద్రాల‌కు వెళ్లాల్సిందే.  అక్క‌డ ప్ర‌త్యేక వాహ‌నాల్లో తీసుకెళ్లి చూసిస్తారు.  అయితే, ఎక్కువ‌సేపు అక్క‌డ ఉండ‌టం కుద‌ర‌ని ప‌ని.  సింహాల‌కు ఆఫ్రికా ఖండం ప్ర‌సిద్ధి.  అక్క‌డ అనేక సింహాల సంర‌క్ష‌ణా కేంద్రాలు ఉన్నాయి.  అందులో ద‌క్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంర‌క్ష‌ణా కేంద్రం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది.  ఆ కేంద్రంలో భ‌యంక‌ర‌మైన సింహాలు అనేకం ఉంటాయి.  అత్యంత బ‌రువైన సింహాలు జీజీ సింహాల సంర‌క్ష‌ణా కేంద్రంలో ఉన్నాయి.  ఇక్క‌డ ఓ ప్ర‌త్యేక‌త ఉంది.  సింహాల‌ను ద‌గ్గ‌ర‌గా చూడాలి అనుకునే వారిని ప్ర‌త్యేక‌మైన గ్లాస్‌తో త‌యారు చేసిన బోనులో ఉంచి సింహాల మ‌ద్య‌న వ‌దిలేస్తారు.  సింహాలు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చూస్తుంటాయి.  గ్లాస్‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి.  గ్లాస్ డోర్ మాత్ర‌మే అడ్డు.  అంత ద‌గ్గ‌ర‌గా సింహాల‌ను చూడడం అంటే ఎంత‌టి గుండెధైర్యం కావాలో ఆలోచించండి.  మీకు ఆ ధైర్యం ఉంటే ద‌క్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంర‌క్ష‌ణా కేంద్రాని వెళ్లి హ్యాపీగా చూసేయ్యేచ్చు.  

Read: తాలిబ‌న్ల‌పై ఆఫ్ఘ‌న్ స్థానిక దళాలు పోరాటం… మూడు జిల్లాలకు విముక్తి…

Exit mobile version