Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..

  • జర్మనీలో 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు.. రోబోను స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టిన పోలీసులు..
Cologne Robot Incident

Cologne Robot Incident

Robot: జర్మనీలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ రోబో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రోబోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఇద్దరు వ్యక్తులు లైవ్ స్ట్రీమ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. జర్మనీలోని కొలోన్ నగరంలో ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట తన స్నేహితులతో బాలిక మాట్లాడుతుండగా, వెనక నుంచి వచ్చిన రోబో ఆమె పిరుదులను తాకి, అసభ్యంగా కదలికలు చేసిందని కొలోన్ పోలీసులు తెలిపారు.

రెడ్-గోల్డ్ కలర్‌లో ఉన్న రోబో చేసిన చర్యను రోబో యజమాని(16 ఏళ్లు), అతడి 19 ఏళ్ల ఫ్రెండ్ రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ, కామెంట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్మాత దీనిని ఒక కారు డిక్కీలో కనుగొన్నారు. ఇద్దరు అనుమానిత వ్యక్త దగ్గర నుంచి రోబోతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనుమానితులు ఇద్దరు రిమోట్ ద్వారా దానిని కంట్రోల్ చేసినట్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిని ‘‘అటాక్’’గా అధికారులు అభివర్ణించారు. లైంగిక వేధింపుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రోబో ఎలా పనిచేస్తోందో అని పరీక్షించారా? లేదా దానిని ఉద్దేశపూర్వకంగా నియంత్రించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.