NTV Telugu Site icon

శాస్త్ర‌వేత్త‌ల తాజా ప‌రిశోధ‌న‌: క‌రోనాకు చెక్ పెట్టేందుకు…

క‌రోనా పాజిటివ్ కేసులు ప్ర‌పంచంలో త‌గ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంత‌రం చెందుతూ వైర‌స్ బ‌లం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్న‌ది.  వ్యాక్సిన్ తీసుకుంటున్నా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకోలేక‌పోతున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా క‌రోనా ఎటాక్ అవుతుండ‌టంతో స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.  ప్ర‌స్తుతం డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కార‌ణం అయింది.  ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి.  అయితే, జ‌ర్మనీకి చెందిన శాస్త‌వేత్త‌లు అందుబాటులో ఉన్న యాంటీబాడీల కంటే 1000 రెట్లు శ‌క్తివంత‌మైన  నానో యాంటిబాడీల‌ను డెవ‌ల‌ప్ చేసింది.  

Read: సోడాల శ్రీదేవి వచ్చేసింది.. సూరిబాబు హ్యాపీ !

ఈ నానో యాంటీబాడీలు ఆందోళ‌న‌క‌రంగా మారిన వేరియంట్‌ల‌పై స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఈ మినీ యాంటీబాడీల‌ను ద‌క్షిణ అమెరికా దేశాల్లో క‌నిపించే ఆల్ఫాకా అనే జీవుల ర‌క్తం నుంచి త‌యారు చేసిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఇవి 95 డిగ్రీల వేడిలో కూడా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది.  ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లు క్లీనిక‌ల్ ద‌శ‌లో ఉన్నాయని, త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెబుతున్నారు.