Site icon NTV Telugu

Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు

Germani President

Germani President

ఒక దేశ ప్రధాని మరో దేశంలో పర్యటిస్తున్నారంటే ఆయనకు స్వాగతం పలికే దగ్గరి నుంచి విడ్కోలు వరకు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఆయన బయలుదేరుతున్నారనే సమాచారం అందగానే ఆ దేశ ప్రధానీ నుంచి పర్యాటకశాఖ మంత్రి, ముఖ్య నేతుల, అధికారులు ఎయిర్‌పోర్టు వద్ద ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇరు దేశాలు చేసే హాడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఖతార్‌లో పర్యటనకు వెళ్లిన జర్మనీ అధ్యక్షుడికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టు వద్దే ఆయనకు అవమానం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌ తాజాగా ఖతార్‌లో పర్యటించారు.

Also Read: PNB Bank: బ్యాంక్‌లో భారీ చోరి.. సిబ్బంది ఉండగానే రూ. 18.8 కోట్ల నగదు లూటి

గురువారం ఆయన విమానం దోహాలో ల్యాండ్ అయ్యింది. అప్పటికే జర్మన్‌ ఎంబసీ అధికారులు, సైనికులు ఆయనకు స్వాగతం పిలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన అరగంట వరకు విమానం దిగలేదు. డోర్ వద్దే నిల్చుని ఉండిపోయారు. కారణం ఖతార్ మంత్రులు సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆయన విమానం దిగలేదు. వారికోసం మెట్ల వద్దే చేతులుకట్టుకుని అరగంటపాటు వేచిచూశారు. ఎట్టకేలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుల్తాన్‌ అల్‌ మురైచాయ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. దీంతో విమానం దిగిన వాల్టర్ అనంతరం ఖతార్‌ రాజు షేఖ్‌ తమిమ్‌ ఇన్‌ అహ్మద్‌ అల్‌ థానీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకున్న అనంతరం స్వదేశానికి పయణమయ్యారు. అలా ఆయన పర్యటన మూడుగంటల్లోనే ముగిసిపోయింది.

Also Read: ED Officer Arrest: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Exit mobile version