Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్ధరాత్రి… చుట్టూ దట్టమైన చీకటి… గాలిలో ఒక వింత అలజడి… పాత భవనాల మధ్య పొడవైన నీడలు కదులుతున్నాయి… సమాధుల వరుసల పక్కన వందలాది మంది యువకులు నిలబడి ఉన్నారు… వారి కళ్లన్నీ ఆకాశం వైపే… గడియారం పన్నెండు కొడుతుంది… వెంటనే.. ఆ క్షణంలో అక్కడ ఉన్న వందలాది మంది ఒక్కసారిగా తోడేళ్లలా అరవడం మొదలుపెడతారు…ఆ అరుపులు చీకటిని చీల్చుకుంటూ సమాధుల మధ్య ప్రతిధ్వనిస్తాయి.
దూరంగా ఉన్న పురాతన భవనం కిటికీలు ఆ శబ్దంతో వణికినట్టు అనిపిస్తాయి. అది భూతాల గ్రామం కాదు… శాపగ్రస్త కోట కూడా కాదు..! అది అమెరికాలోని ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ…! అవును..! అది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన హాలోవీన్ వేడుకలు జరిగే జార్జ్ టౌన్ యూనివర్సిటీ. ఏంటి..? నమ్మడంలేదా?
Also Read
- Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
నిజంగా దెయ్యాలున్నాయా?
అమెరికాలో హాలోవీన్ అంటే కాస్ట్యూమ్ పార్టీలు కాదు…చాక్లెట్లు పంచుకోవడం కాదు…భయాన్ని ఒక పండుగలా జరుపుకోవడం. దెయ్యాల కథలను ఒక సంప్రదాయంగా కొనసాగించడం. ఒక్కమాటలో చెప్పాలంటూ హారర్ సినిమాను నిజ జీవితంలో కలిపేయడం. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ చివరి వారంలో ఈ క్యాంపస్ పూర్తిగా మారిపోతుంది. పగటిపూట సాధారణంగా కనిపించే భవనాలు రాత్రి పడగానే భయానక కథలకు వేదికలుగా మారిపోతాయి. విద్యార్థులు చదువుకునే కారిడార్లలోనే దెయ్యాల గుసగుసలు వినిపిస్తాయి. దశాబ్దాలుగా మూసి ఉంచిన గదుల గురించి వింత శబ్దాలు వినిపిస్తాయి.
కొందరు అక్కడ వింత ఆకారాలు చూశామని చెబుతారు. మరికొందరు అర్ధరాత్రి అడుగుల శబ్దాలు విన్నామని చెబుతారు. ఈ భయానక వాతావరణానికి మరో కారణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వణికించిన ది ఎగ్జార్సిస్ట్ సినిమా ఈ యూనివర్సిటీతో విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉంది. హారర్ సినిమాల చరిత్రను రెండు భాగాలుగా విభజించిన ఆ సినిమాను ఇక్కడే చిత్రీకరించారు. అంతేకాదు ఆ కథను రాసిన విలియమ్ పీటర్ బ్లాటీ కూడా ఇదే యూనివర్సిటీలో చదివాడు.
ఒక నిజ జీవిత భూతవైద్య ఘటన గురించి తెలుసుకున్న తర్వాత అతను రాసిన కథ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమాల్లో ఒకటిగా మారింది. అప్పటి నుంచి జార్జ్ టౌన్ పేరు కేవలం యూనివర్సిటీగా మాత్రమే కాకుండా.. ఒక హారర్ లెజెండ్‌గా కూడా నిలిచిపోయింది.
ఇక క్యాంపస్‌లో అత్యంత భయంకరమైన ప్రదేశంగా హీలీ హాల్ నిలుస్తోంది. బయట నుంచి చూస్తే ఇది ఒక అందమైన చారిత్రక భవనం. కానీ రాత్రి పడగానే దీని గురించి వినిపించే కథలు మారిపోతాయి. కొన్ని అంతస్తుల్లో దెయ్యాలు తిరుగుతాయని ప్రచారం. కొన్ని గదులు రహస్యంగా మూసివేశారని కథలు చెబుతుంటాయి. ఒకప్పుడు అక్కడ భూతవైద్యం జరిగిందని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు.
పీడకలలు వస్తాయా?
ఈ కథల్లో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు కానీ.. భయం మాత్రం ప్రతి సంవత్సరం వేలాది మందిని ఈ భవనం వైపు లాగుతుంది. హాలోవీన్ ముందు శనివారం రాత్రి హీలీ హాల్లోకి అడుగుపెడితే అది కచ్చితంగా పీడకలగా మిగిలిపోతుంది. చీకటితో నిండిపోయిన పొడవైన మార్గాలు కనిపిస్తాయి. అక్కడ కనిపించని మూలల నుంచి అరుపులు వినిపిస్తాయి. నీడల్లో దాక్కుని ఒక్కసారిగా ఎదురుగా దూసుకొచ్చే వింత ఆకారాలతో పాటు.. ప్రతి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే తర్వాతి క్షణంలో ఏం కనిపిస్తుందో ఎవరికీ తెలియదు.
ఇంత భయం మధ్య మరో సంప్రదాయం కోసం విద్యార్థులు ఎదురు చూస్తారు. అదే ది ఎగ్జార్సిస్ట్ ప్రత్యేక ప్రదర్శన. రాత్రి ఆకాశం కింద వందలాది మంది విద్యార్థులు ఒకేచోట చేరతారు. తెరపై ప్రపంచాన్ని భయపెట్టిన సినిమా మొదలవుతుంది. ఆ సినిమా తెరకెక్కిన ప్రదేశంలోనే కూర్చుని అదే కథను చూడటం ఒక వింత అనుభూతి. సినిమా ముగిసే సమయానికి చాలామంది నవ్వుతూ ఉంటారు. కానీ వారి మనసులో ఎక్కడో ఒక మూల చిన్న భయం మాత్రం మిగిలే ఉంటుంది.
ఆ తర్వాత వస్తుంది ఈ యూనివర్సిటీలో అత్యంత విచిత్రమైన క్షణం. రాత్రి పన్నెండు గంటలు. జెసూట్ సమాధుల తోట. చుట్టూ నిశ్శబ్దం. వందలాది మంది విద్యార్థులు.. గడియారం పన్నెండు కొట్టిన క్షణంలో అందరూ ఒక్కసారిగా ఆకాశం వైపు తలెత్తి తోడేళ్లలా అరవడం ప్రారంభిస్తారు. ఆ అరుపులు సమాధుల మధ్య మారుమోగుతాయి. కొన్ని క్షణాల పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తాము ఒక యూనివర్సిటీలో కాకుండా ఏదో భయానక సినిమాలో ఉన్నామేమో అనిపిస్తుంది.
నిజానికి ప్రపంచంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ హారర్ సినిమా చరిత్రను… దెయ్యాల కథలను… సమాధుల మధ్య జరిగే అర్ధరాత్రి సంప్రదాయాలను… ఒకే చోట కలిపిన యూనివర్సిటీ మాత్రం చాలా అరుదు. అందుకే జార్జ్ టౌన్లో హాలోవీన్ ఒక పండుగ కాదు. ప్రతి సంవత్సరం తిరిగి ప్రాణం పోసుకునే ఒక భయానక గాథ.
తాజావార్తలు
-
RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
-
Peddi: మెగా ఫ్యాన్స్‌కు కీలక అప్డేట్.. ‘పెద్ది’ టికెట్లును ఇలా బుక్ చేసుకోండి!
-
Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
-
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
-
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!