Geomagnetic storm: సూర్యుడు ప్రస్తుతం తన 14 సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై అనేక రకాల చర్యలు జరుగున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సూర్యుడు ‘సోలార్ మాగ్జిమమ్’ స్థితికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వల్ల సూర్యుడి వాతావరణంలో గందళగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి సౌరజ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ)లు వెలువడుతుంటాయి. కొన్నిసార్లు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల నుంచి సౌరజ్వాలలు వెలువడుతుంటాయి.
సూర్యుని నుండి ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) గంటకు మిలియన్ల కిలోమీటర్ల వేగంతో విశ్వంలోకి వెలువడుతుంది. ఇది భూమిపై ప్రభావం చూపిస్తుంది. సీఎంఈల్లో ఉండే అవేశిత కణాలు భూవాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మా కణాలు భూ అయస్కాంత తుఫానులను (జియో మాగ్నిటిక్ తుఫాన్) ప్రేరేపించే అవకాశం ఉంది.
Read Also: Imran Khan Arrest: రణరంగంగా పాకిస్తాన్.. పలుచోట్ల ఆర్మీ కంటోన్మెంట్ల ముట్టడి..
మే 7నరివర్స్డ్ పొలారిటీ సన్ స్పాట్ AR3296 నుండి కరోనల్ మాస్ ఎజెక్షన్ వెలువడింది. కరోనల్ మాస్ ఎజెక్షన్ విడుదలైనప్పుడు చాలా వేగంతో బిలియన్ల టన్నుల అవేశిత కణాలు విశ్వంలోకి వెదజల్లబడుతాయి. ఈ కణాలు గంటలకు 30 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ కణాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు భూమిపై G1 క్లాస్ మైనర్ జియోమాగ్నిటిక్ తుఫాన్ వస్తుందని యూఎస్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ అంచనా వేసింది. గత వారం సూర్యుడు 14 ముఖ్యమైన సౌర మంటలు, 31 కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల జరిగాయి.
దీని వల్ల పవర్ గ్రిడ్స్ లో హెచ్చుతగ్గులు, శాటిలైట్లపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. అయనోస్పియర్ పొరలో విద్యుత్ ప్రవాహాలను సృష్టిస్తుంది. కొన్ని వలస పక్షలను అధికస్థాయిలో ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వలసపక్షలు తమ ప్రయాణాలకు భూమి అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తాయి. ఈ సీఎంఈల వల్ల వాటిలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అయితే భూమికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం వీటిని అడ్డుకుంటుంది. దీంతో భూమిపై ప్రజలు వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే వీటి మూలంగా ధృవాల మధ్య అరోరాలు ఏర్పడుతాయి.