NTV Telugu Site icon

Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..

Gaza Truce Deal

Gaza Truce Deal

Gaza Truce Deal: ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న ‘‘గాజా యుద్ధానికి’’ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధవిరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయిలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయిల్ ,దాని మిత్ర దేశాలకు చెందినవారిని బందీలుగా తీసుకెళ్లింది. ఇప్పటికీ 94 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని, వీరిలో 34 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది.

హమాస్‌తో ఒప్పందం ప్రకారం 33 మంది బందీలను విడుదల చేయనున్నారు, వీరిలో కొందరు సజీవంగా ఉండకపోవచ్చని ఇజ్రాయిల్ సీనియర్ అధికారులు చెప్పినట్లు సమాచారం. వచ్చే సోమవారం తన ప్రమాణ స్వీకారానికి ముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చుకోవచ్చని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బహుశా ఈ వారం చివరి నాటికి సంధి కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ కూడా ఇదే రకమైన వాదనలు చేశారు.

Read Also: YS Subba Reddy: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తిరుపతి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి..

ఒప్పందం నిబంధనలు..
సంధి ఒప్పందంలో మొదటి దశలో విడుదలయ్యే 33 మందిలో చనిపోయిన బందీల మృతదేహాలు కూడా ఉంటాయని ఇజ్రాయిల్ భావిస్తోంది.

ఒప్పందంలో మొదటి దశ బందీల విడుదల జరుగుతుంది. రెండవ దశకు సంబంధించిన చర్చలు యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించినవి. విడుదల ఒప్పందాన్ని అమలు చేసిన 16వ రోజు ప్రారంభమవుతాయి.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. మొదటి దశలో మొదటి దశలో, ఇజ్రాయెల్ దళాలు ఫిలడెల్ఫీ కారిడార్ వెంబడి ఉంటాయి – ఇది ఈజిప్ట్-గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇరుకైన భూభాగం. సెప్టెంబరులో ఒప్పందాన్ని ఖరారు చేయలేకపోవడానికి కారిడార్ వెంట ఇజ్రాయెల్ దళాలు ఉండటం ఒక కారణం.

ఇజ్రాయిల్ సరిహద్దు వెంబడి గాజా లోపల ఇజ్రాయిల్ ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తుంది. బఫర్ జోన్ వెడల్పు ఇంకా స్పష్టం కాలేదు. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. బఫర్ జోన్ అక్టోబర్ 7 కి ముందు ఉన్న సరిహద్దు రేఖకు 300–500 మీటర్లు (330–545 గజాలు) తిరిగి రావాలని హమాస్ కోరుకుంటోంది. అయితే ఇజ్రాయిల్ ఇది 2000 మీటర్ల ఉండాలని కోరుకుంటోంది.

ఇదే కాకుండా ఉత్తర గాజా నివాసితులు గాజా స్ట్రిప్ ఉత్తరానికి స్వేచ్ఛగా తిరిగి రావచ్చు. అయితే, ఇక్కడ పేర్కనబడని భద్రతా ఏర్పాట్లు అమలులో ఉంటాయని ఇజ్రాయిల్ చెబుతోంది.

ఇజ్రాయిల్ బంధించిన పాలస్తీనా ఖైదీలను, ఇజ్రాయిలీల హత్యలకు బాధ్యులగా భావించే వారిని వెస్ట్ బ్యాంక్‌లోకి విడుదల చేయరు. దీనికి బదులుగా విదేశాలతో ఒప్పందాల తర్వాత గాజా స్ట్రిప్ లేదా ఇతర విదేశాలకు పంపుతారు.

Show comments