NTV Telugu Site icon

Israel-Hamas: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ!

Israelhamas

Israelhamas

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు మంగళవారం ఖతర్ తెలిపింది. ఇందుకు హమాస్ అంగీకరించినట్లు పేర్కొంది. బందీలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తోసిపుచ్చింది. కాల్పుల విరమణ, బందీల అప్పగించేందుకు హమాస్ నుంచి ఇంకా స్పందన రాలేదని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. ఒకవేళ అంగీకరిస్తే.. బుధవారం రాత్రికి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంటుందని జెరూసలేం అధికారులు ఇజ్రాయెల్ మీడియాకు తెలిపారు. హమాస్ వైపు నుంచే స్పందన రాలేనట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: IBPS Exam Calendar 2025: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్.. ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్

ఇదిలా ఉంటే ఓ వైపు కాల్పుల విరమణపై చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు ఇజ్రాయెల్.. గాజాపై దాడి చేస్తూనే ఉంది. తాజా దాడుల్లో 24 మంది పాలస్తీనీయులు మరణించినట్లు సమాచారం. ఐడీఎఫ్.. 50 ఉగ్ర లక్ష్యాలను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇరు దేశాల మధ్య చర్యలు ఫలించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఒప్పందాలపై ఇప్పటి వరకు హమాస్ ఎక్కడా స్పందించలేదు. బందీలను విడుదల చేసేందుకు మొగ్గు చూపడం లేదని సమాచారం. పరిమితంగానే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చర్చలపై తర్జనభర్జన జరుగుతోంది. అన్ని ఓకే అయితే ఈ రాత్రికి ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Manchu Manoj: బయటినుంచి రౌడీలను తీసుకొచ్చారు..వాళ్లకు నేను ఒక్కడిని చాలు!

ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగితే హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలి. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేయాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల దళాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. గాజాలోకి మానవతా సహాయం చేయడానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఇదిలా ఉంటే ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కొందరు సభ్యులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇలా చర్చలపై తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kaushik Reddy: రేపు విచారణకు హాజరు కావాలి.. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు

Show comments