Site icon NTV Telugu

Emmanuel Macron: ఆ చెంప దెబ్బ వెనుక అసలు కథ ఇది

Macron Slapped Video

Macron Slapped Video

French President Emmanuel Macron Old Slapped Video Going Viral Again: ఒక మహిళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ చెంప ఛెళ్లుమనిపించిందంటూ.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. బారియర్‌కి అటువైపున్న మక్రాన్ తన ఎదురుగు ఉన్నవారితో మాట్లాడుతుండగా, ఆయన చెంప పగలగొట్టడాన్ని మనం గమనించవచ్చు. వెనుక భాగం నుంచి వీడియోని రికార్డ్ చేసి ఉండటం, మహిళ తరహాలోనే వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉండటంతో.. ఓ మహిళ ఆయనపై దాడి చేసినట్టు ప్రచారం మొదలైంది. ట్విటర్‌లో చాలామంది షేర్ చేయడంతో.. ఈ వార్తని ప్రధాన వెబ్‌సైట్‌లు కూడా రాసేశాయి. తీరా చూస్తే.. అది ఇప్పటి వీడియో కాదని, గతేడాది చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిందని తేలింది. అంటే, ఇప్పుడు తాజాగా మక్రాన్‌పై ఎలాంటి దాడి జరగలేదు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆయనపై దాడి చేసింది మహిళ కాదు, ఓ వ్యక్తి.

గతేడాది కొవిడ్ సమయంలో.. సదర్న్ ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతానికి మక్రాన్ వెళ్లాడు. కొవిడ్ ప్యాండెమిక్ తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజల జీవనం ఎలా సాగుతోంది? వారి కష్టాలేంటి? ఎలాంటి సహాయసహకారాలు అందించాలో తెలుసుకోవడం కోసం.. నేరుగా అధ్యక్షుడే రంగంలోకి దిగాడు. అక్కడి విద్యార్థులు, రెస్టారెంట్ యజమానులతో పాటు స్థానికులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది.. అధ్యక్షుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, మెటర్ బారియర్ సిద్ధం చేశారు. అటువైపు నుంచే వ్యక్తులు మాట్లాడేలా చర్యలు తీసుకున్నారు. అయితే.. మక్రాన్ ప్రజలతో మమేకం అవ్వడం కోసం చాలా దగ్గరగా వెళ్లి ప్రజలతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే గోధుమ రంగు టీషర్ట్‌లో పొడవాటి జుట్టు కలిగి ఉన్న ఒక వ్యక్తి.. ఒక్కసారిగా మక్రాన్‌పై దాడి చేశాడు. ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే అతడ్ని తోసేసింది. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అతడు నాలుగు నెలల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు.

ఇదండి.. ఆ వీడియో వెనుకున్న అసలు కథ. గతేడాదిలో కొవిడ్ సమయంలో జరిగిన ఈ సంఘటన వీడియోనే ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తేడా ఏమిటంటే.. అప్పుడు ఆ దృశ్యాలన్ని ఒకవైపు నుంచి తీశారు. అందులో దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కానీ, తాజాగా వైరల్ అవుతోన్న వీడియో మాత్రం వెనుక నుంచి రికార్డ్ చేసినది. అందుకే.. దాడి చేసింది మహిళ అనుకొని, మరోసారి మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైందని, నిజానిజాలు నిర్ధారించుకోకుండానే కథనాలు రాసేశారు. అసలు విషయం తెలిశాక.. ఆ కథనాల్ని తొలగించేశారు.

Exit mobile version