Emmanuel Macron: ఆ చెంప దెబ్బ వెనుక అసలు కథ ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
French President Emmanuel Macron Old Slapped Video Going Viral Again: ఒక మహిళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ చెంప ఛెళ్లుమనిపించిందంటూ.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. బారియర్‌కి అటువైపున్న మక్రాన్ తన ఎదురుగు ఉన్నవారితో మాట్లాడుతుండగా, ఆయన చెంప పగలగొట్టడాన్ని మనం గమనించవచ్చు. వెనుక భాగం నుంచి వీడియోని రికార్డ్ చేసి ఉండటం, మహిళ తరహాలోనే వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉండటంతో.. ఓ మహిళ ఆయనపై దాడి చేసినట్టు ప్రచారం మొదలైంది. ట్విటర్‌లో చాలామంది షేర్ చేయడంతో.. ఈ వార్తని ప్రధాన వెబ్‌సైట్‌లు కూడా రాసేశాయి. తీరా చూస్తే.. అది ఇప్పటి వీడియో కాదని, గతేడాది చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిందని తేలింది. అంటే, ఇప్పుడు తాజాగా మక్రాన్‌పై ఎలాంటి దాడి జరగలేదు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆయనపై దాడి చేసింది మహిళ కాదు, ఓ వ్యక్తి.
గతేడాది కొవిడ్ సమయంలో.. సదర్న్ ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతానికి మక్రాన్ వెళ్లాడు. కొవిడ్ ప్యాండెమిక్ తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజల జీవనం ఎలా సాగుతోంది? వారి కష్టాలేంటి? ఎలాంటి సహాయసహకారాలు అందించాలో తెలుసుకోవడం కోసం.. నేరుగా అధ్యక్షుడే రంగంలోకి దిగాడు. అక్కడి విద్యార్థులు, రెస్టారెంట్ యజమానులతో పాటు స్థానికులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది.. అధ్యక్షుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, మెటర్ బారియర్ సిద్ధం చేశారు. అటువైపు నుంచే వ్యక్తులు మాట్లాడేలా చర్యలు తీసుకున్నారు. అయితే.. మక్రాన్ ప్రజలతో మమేకం అవ్వడం కోసం చాలా దగ్గరగా వెళ్లి ప్రజలతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే గోధుమ రంగు టీషర్ట్‌లో పొడవాటి జుట్టు కలిగి ఉన్న ఒక వ్యక్తి.. ఒక్కసారిగా మక్రాన్‌పై దాడి చేశాడు. ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే అతడ్ని తోసేసింది. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అతడు నాలుగు నెలల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు.
Also Read
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ఇదండి.. ఆ వీడియో వెనుకున్న అసలు కథ. గతేడాదిలో కొవిడ్ సమయంలో జరిగిన ఈ సంఘటన వీడియోనే ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తేడా ఏమిటంటే.. అప్పుడు ఆ దృశ్యాలన్ని ఒకవైపు నుంచి తీశారు. అందులో దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కానీ, తాజాగా వైరల్ అవుతోన్న వీడియో మాత్రం వెనుక నుంచి రికార్డ్ చేసినది. అందుకే.. దాడి చేసింది మహిళ అనుకొని, మరోసారి మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైందని, నిజానిజాలు నిర్ధారించుకోకుండానే కథనాలు రాసేశారు. అసలు విషయం తెలిశాక.. ఆ కథనాల్ని తొలగించేశారు.
Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB
— Luke Rudkowski (@Lukewearechange) November 20, 2022
తాజావార్తలు
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!