సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. గతంలో మన తాతముత్తాతలు బాగా సైకిల్ తొక్కేవారు. అందుకే వారికి ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు టూవీలర్ల వినియోగం బాగా పెరిగిపోయింది.చిన్నచిన్న దూరాలకు కూడా టూ వీలర్స్ వాడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా తియ్యరా బండి అనేలా తయారయ్యారు. అయితే వీఐపీలు కూడా ఇప్పుడు సైకిల్ యాత్రలు చేస్తున్నారు. తాజాగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ,డెన్మార్క్ ప్రధాన మంత్రి సైకిల్ పై సవారీ చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, డెన్మార్మ్ ఉప ప్రధానమంత్రి అలెగ్జాండర్ కుబెరకోవ్ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని వారు ఆకాంక్షించారు.
Read Also:Lalit Modi: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
ఈ వీఐపీలిద్దరూ రోడ్లపై సైకిల్ తొక్కుతుంటే.. ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది వారిని అనుసరించారు. వీరిద్దరి సైక్లింగ్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ సైకిల్ తొక్కుతుంటే అనుచరులు నినాదాలు చేస్తూ ఉత్సాహ పరిచారు.
