Israel Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య బందీల మార్పిడి జరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయిలీలను విడిచిపెడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ బందీల ఒప్పందంలో భాగంగా హమాస్ శనివారం మరో ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. బందీల్లో ఒకరైన ఒమర్ షెమ్ టోవ్, హమాస్ ఉగ్రవాది నుదుటిపై ముద్దు పెట్టడం సంచలనంగా మారింది.
Read Also: Linguswamy : రూ.700కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న లింగుస్వామి
అయితే, ఈ ముద్దు ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బందీగా ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లకు ముద్దు ఇవ్వడం ఏంటని ఇజ్రాయిల్ ప్రజలు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే, షెమ్ టోవ్ విడుదలైన తర్వాత కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విడిచిపెట్టే ముందు, హమాస్ మిలిటెంట్‌ని ముద్దు పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని, తనను అలా చేయాలని చెప్పారని అతను చెప్పాడు. షెమ్ టోవ్ తండ్రి మాట్లాడుతూ, అతన్ని బంధించిన వారు “అతని పక్కన నిలబడి ఉన్న [ముసుగు] ఉన్న గార్డు నుదిటిపై ముద్దు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు.
అక్టోబర్ 07, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసి 1200 మందిని చంపారు. 250 మందిని అపహరించి గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై హమాస్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇజ్రాయిల్ లోని నెగెవ్ ఎడారిలో జరిగిన నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సమయంలో షెమ్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల్ని హమాస్ బందీలుగా తీసుకుంది.