NTV Telugu Site icon

Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఇక్కట్లు.. ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ

Bashar Al Assad

Bashar Al Assad

సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పదవీచ్యుతుడై రష్యాలో తలదాచుకుంటున్నాడు. అయితే ఇటీవల అసద్ విషప్రయోగం జరిగింది.. సీరియస్‌గా ఉందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. తాజాగా అసద్‌కు ఫ్యాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్ మరొక అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఒకటి జారీ చేయగా.. ఇది రెండో వారెంట్. 2017లో ఫ్రెంచ్ పౌరుడి మరణంపై దర్యాప్తులో భాగంగా ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక ప్రాసిక్యూటర్ ఈ వారెంట్ జారీ చేసింది. సిరియాలో బాంబు దాడిలో జూన్ 7, 2017న మరణించిన ఫ్రెంచ్-సిరియన్ జాతీయుడు సలా అబౌ నబోర్ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 20న ఈ వారెంట్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ ఆట అదుర్స్.. యువ క్రికెటర్ పేరిట కొత్త రికార్డు

డిసెంబర్, 2024లో తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. డమాస్కస్‌ను రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో అసద్.. రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం రష్యాలో అసద్ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ విషప్రయోగం జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆయన గురించి అప్‌డేట్ ఎక్కడా రాలేదు.

ఇది కూడా చదవండి: Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!