Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
- సోవియట్ జేమ్స్ బాండ్ ‘సెర్గీ ఇవనోవ్’ కన్నుమూత.. రష్యాలో వీడని మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sergei Ivanov: రష్యా రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన మాజీ రక్షణ మంత్రి, ఒకప్పుడు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వారసుడిగా భావించబడిన సెర్గీ ఇవనోవ్ (73) కన్నుమూశారు. ఈ మేరకు క్రెమ్లిన్ (రష్యా అధికారిక నివాసం) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆయన మరణానికి గల కారణాలు కానీ, ఇతర వివరాలను కానీ క్రెమ్లిన్ వెల్లడించకపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పుతిన్ తన చిరకాల మిత్రుడైన ఇవనోవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేజీబీ రోజుల్లో మొదలైన బంధం..
లెనిన్గ్రాడ్లో జన్మించిన సెర్గీ ఇవనోవ్, రష్యా గూఢచార సంస్థ అయిన కేజీబీలో అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1970ల చివరలో కేజీబీ లెనిన్గ్రాడ్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న సమయంలోనే పుతిన్‌తో ఆయనకు బలమైన స్నేహం ఏర్పడింది. పుతిన్ తూర్పు జర్మనీలో విధులు నిర్వహిస్తే, ఇవనోవ్ ఫిన్లాండ్, కెన్యా దేశాల్లో గూఢచారిగా పనిచేశారు. ఇవనోవ్ ఎంతటి వ్యూహకర్త అంటే.. రష్యన్ వర్గాల్లో ఆయనను ‘సోవియట్ జేమ్స్ బాండ్’ అని, హాలీవుడ్ సినిమా క్యారెక్టర్‌ను పోల్చుతూ ‘ది మ్యాట్రిక్స్ ఏజెంట్ స్మిత్’ అని పిలిచేవారు.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
రష్యా రాజకీయాల్లో నంబర్-2..
1998లో పుతిన్ రష్యా అంతర్గత భద్రతా సంస్థ అధిపతి అయినప్పుడు, ఇవనోవ్‌ను తన డిప్యూటీగా నియమించుకున్నారు. ఆ తర్వాత పుతిన్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. ఇవనోవ్ భద్రతా మండలి కార్యదర్శి, రక్షణ మంత్రి (2001-2007), మొదటి ఉప ప్రధానమంత్రి, క్రెమ్లిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి అత్యంత కీలకమైన పదవులను నిర్వహించారు. రష్యా రక్షణ మంత్రిగా చెచ్న్యా రెండో యుద్ధాన్ని ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. రష్యాను శాసించే అత్యంత శక్తివంతమైన అధికారుల బృందం “సిలోవికి”లో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవారు. 2008లో పదవీకాల పరిమితుల కారణంగా పుతిన్ తాత్కాలికంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు.. పుతిన్ స్థానంలో ఇవనోవ్నే తదుపరి అధ్యక్షుడిని చేస్తారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో పుతిన్ తన నిర్ణయాన్ని మార్చుకుని దిమిత్రి మెద్వెదేవ్‌ను ఎంచుకున్నారు. ఇవనోవ్‌కు మితిమీరిన రాజకీయ ఆశయాలు ఉన్నాయని, ఒకవేళ అతనికి అధ్యక్ష పదవి ఇస్తే తిరిగి తనను అధికారంలోకి రానివ్వడేమోననే భయంతోనే పుతిన్ అతనిని పక్కనబెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు.
2016లో ఇవనోవ్‌ను పర్యావరణ పరిరక్షణ, రవాణా కోసం ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధిగా పుతిన్ నియమించారు. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేని ఈ పదవిని చాలామంది ఇవనోవ్‌కు ఇచ్చిన ‘గౌరవప్రదమైన పదవీ విరమణ’గా భావించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి మద్దతు పలికినందుకు గానూ అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఇవనోవ్‌పై గతంలో ఆంక్షలు కూడా విధించాయి. ఏది ఏమైనప్పటికీ, పుతిన్ రహస్యాల పుట్టగా భావించే ఒక టాప్ గూఢచారి మరణం రష్యాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆయనది సహజ మరణమా, లేక పక్కా స్కెచ్‌తో పైకి పంపించారా అనేది తెలియాల్సి ఉందని అంతర్జాతీయంగా ప్రముఖంగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఆయన మరణం ఎలా సంభవించింది అనే దానిపై ఇప్పటి వరకు క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం ఆశ్చర్యకరం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!