అమెరికా మాజీ అధ్యక్షుడు తీవ్ర అస్వస్థత.. అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. రక్త సంబంధ ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితమే క్లింటన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.
also read : గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
Also Read
- Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ వరుసగా రెండు సార్లు పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న బిల్‌క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ తరపున పలుసార్లు ప్రచార బాధ్యతలను బిల్‌క్లింటన్ చేపట్టారు. క్లింటన్ ఫౌండేషన్ కు సంబంధించిన కార్యక్రమం కోసం కాలిఫోర్నియాలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!