Taliban: అఫ్గాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.. విదేశీయులకు తాలిబన్ల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్గానిస్తాన్ వ్యవహారాలు, రాజకీయాలల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం మానేయాలని తాలిబన్లు హెచ్చరించారు. శుక్రవారం కాబూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్ సుప్రీం నాయకుడు మవ్లావి హైబతుల్లా అఖుంద్జాదా ఇటీవల ఆదేశాలు జారీ చేశాడు. అఫ్గానిస్తాన్ స్వతంత్ర దేశమని, విదేశీయులు ఆదేశాలు ఇవ్వొద్దని.. మా నిర్ణయాలు మేము తీసుకోగలమని మవ్లావి హైబతుల్లా అఖుంద్జాదా ఇటీవల తన ప్రసంగంలో తెలిపినట్లు సీఎన్ఎన్ మీడియా వెల్లడించింది.
గత ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 3,000 మంది హాజరైన మూడు రోజుల మతపరమైన సమావేశంలో అఖుంద్జాదా ఈ వ్యాఖ్యలు చేశారు. హైబతుల్లా అఖుంద్జాదా 2016లో తాలిబన్ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు తాలిబన్ నాయకుడు అక్తర్ మహమ్మద్ మన్సూర్ పాకిస్తాన్లో అమెరికా వైమానిక దాడిలో మరణించిన అనంతరం అఖుంద్జాదా తాలిబన్ నాయకుడిగా పదవిని పొందాడు. తాలిబన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా మద్దతు పొందేందుకు ఇటీవల చేసిన ప్రకటనల కారణంగా ప్రపంచ బ్యాంకు వందల మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను స్తంభింపజేసింది.
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
ఎవరీ జగ్గీ జోహల్?. అతణ్ని విడుదల చేయాలని బ్రిటన్ ఇండియాని ఎందుకు కోరుతోంది?
అఫ్గానిస్తాన్‌లోని మహిళలు, బాలికలు తమ హక్కులను అనుభవించడంలో ఎంతో వెనుకబాటును ఎదుర్కొంటున్నారని యూఎన్ మానవహక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్ అన్నారు. మహిళల హక్కుల విషయంలో తాలిబన్ పాలనను ఆయన ఖండించారు. అఫ్గానిస్థాన్‌లో బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినపుడు మహిళలందరూ తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని తాలిబన్ పాలకులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కళ్లు మాత్రమే కనిపిస్తూ శరీర భాగాలన్నీ కప్పి ఉంచేలా బుర్ఖా ఉండాలని కఠినమైన షరతులు విధించారు. మానవహక్కుల కార్యకర్తలు, అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన ఆందోళనలకు తగ్గట్టే తాలిబన్లు తమ అసలు రూపం క్రమంగా మళ్లీ బయటపెడుతున్నారు. 1996-2001 నాటి తాలిబన్ల కటువైన పాలన, మహిళలపై విధించిన ఆంక్షలను తాజా ఆదేశాలు మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!