NTV Telugu Site icon

Taliban: అఫ్గాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.. విదేశీయులకు తాలిబన్ల హెచ్చరిక

Taliban Government

Taliban Government

అఫ్గానిస్తాన్ వ్యవహారాలు, రాజకీయాలల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం మానేయాలని తాలిబన్లు హెచ్చరించారు. శుక్రవారం కాబూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్ సుప్రీం నాయకుడు మవ్లావి హైబతుల్లా అఖుంద్‌జాదా ఇటీవల ఆదేశాలు జారీ చేశాడు. అఫ్గానిస్తాన్ స్వతంత్ర దేశమని, విదేశీయులు ఆదేశాలు ఇవ్వొద్దని.. మా నిర్ణయాలు మేము తీసుకోగలమని మవ్లావి హైబతుల్లా అఖుంద్‌జాదా ఇటీవల తన ప్రసంగంలో తెలిపినట్లు సీఎన్‌ఎన్‌ మీడియా వెల్లడించింది.

గత ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 3,000 మంది హాజరైన మూడు రోజుల మతపరమైన సమావేశంలో అఖుంద్‌జాదా ఈ వ్యాఖ్యలు చేశారు. హైబతుల్లా అఖుంద్‌జాదా 2016లో తాలిబన్ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు తాలిబన్ నాయకుడు అక్తర్ మహమ్మద్ మన్సూర్ పాకిస్తాన్‌లో అమెరికా వైమానిక దాడిలో మరణించిన అనంతరం అఖుంద్‌జాదా తాలిబన్ నాయకుడిగా పదవిని పొందాడు. తాలిబన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా మద్దతు పొందేందుకు ఇటీవల చేసిన ప్రకటనల కారణంగా ప్రపంచ బ్యాంకు వందల మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను స్తంభింపజేసింది.

ఎవరీ జగ్గీ జోహల్‌?. అతణ్ని విడుదల చేయాలని బ్రిటన్‌ ఇండియాని ఎందుకు కోరుతోంది?

అఫ్గానిస్తాన్‌లోని మహిళలు, బాలికలు తమ హక్కులను అనుభవించడంలో ఎంతో వెనుకబాటును ఎదుర్కొంటున్నారని యూఎన్ మానవహక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్ అన్నారు. మహిళల హక్కుల విషయంలో తాలిబన్‌ పాలనను ఆయన ఖండించారు. అఫ్గానిస్థాన్‌లో బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినపుడు మహిళలందరూ తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని తాలిబన్‌ పాలకులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కళ్లు మాత్రమే కనిపిస్తూ శరీర భాగాలన్నీ కప్పి ఉంచేలా బుర్ఖా ఉండాలని కఠినమైన షరతులు విధించారు. మానవహక్కుల కార్యకర్తలు, అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన ఆందోళనలకు తగ్గట్టే తాలిబన్లు తమ అసలు రూపం క్రమంగా మళ్లీ బయటపెడుతున్నారు. 1996-2001 నాటి తాలిబన్ల కటువైన పాలన, మహిళలపై విధించిన ఆంక్షలను తాజా ఆదేశాలు మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి.