Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
- పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
- వేగంగా కోలుకుంటున్నారని వెల్లడి
- కుటుంబ సభ్యులతో కలిసి మచ్చర్‌కు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేతిలో గాయపడ్డ భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పైలట్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. యూఏఈలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌ను దీపక్ మిత్తల్.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“కెప్టెన్ మచ్చర్ ఆరోగ్యంగా ఉన్నారు. బాగా కోలుకుంటున్నారు. కొనసాగుతున్న వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నాం.’’ అని వెల్లడించింది. ఘటన జరిగిన అనంతరం మచ్చర్‌ను తొలుత వాయవ్య సౌదీ అరేబియాలోని టబుక్‌లో ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఒక రోజు తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను యూఏఈకి తరలించారు.
Also Read
కో-పైలట్‌తో జరిగిన ఘర్షణలో మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన విమానాన్ని నియంత్రించేందుకు, పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బుధవారం రాత్రి రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం మచ్చర్ టబుక్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అప్పటికి ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపింది. తాజాగా యూఏఈలో భారత రాయబారి మిత్తల్ ఆయనను పరామర్శించిన అనంతరం.. మచ్చర్ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్ ఒమన్ జాతీయుడిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం విమానం అత్యంత వేగంగా కిందికి దిగింది. 30 సెకన్లలోపే దాదాపు 14,000 అడుగుల ఎత్తు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే మచ్చర్ తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినిధి డోరన్ స్పీల్‌మన్ పేర్కొన్న వివరాలను ఉటంకిస్తూ ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రచురించింది. మచ్చర్ రక్తసిక్త స్థితిలో ఉన్నప్పటికీ తన దగ్గర మిగిలిన శక్తినంతా ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు అందులో పేర్కొన్నారు.
కాక్‌పిట్‌లో జరిగిన ఘటనను అదుపులోకి తీసుకున్న అనంతరం విమానాన్ని టబుక్‌కు మళ్లించారు. అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కో-పైలట్ విమానాన్ని ప్రమాదానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశాడా? ఘటనకు కారణం ఏమిటి? అనే అంశాలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?