Snake Head Found In Plane Meal: భోజనం చేస్తున్న సమయంలో మనం తింటున్న కంచంలో చిన్న రాయి కనిపించినా చిరాకు వస్తుంది. కానీ ఇటీవల బిర్యాణీల్లో బల్లి, బొద్దింకలు బయటపడుతున్న విషయం తెలిసిందే. భోజనం చేస్తున్న పాము తల బయటపడితే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే టర్కీలోని విమాన సిబ్బందికి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భోజనంలో పాము తల కనిపించడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానంలో సిబ్బంది కేకలు వేసిన వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.
విమాన సిబ్బంది తింటున్న భోజనంలో పాము తల బయటడిన ఘటన తాజాగా టర్కీకి చెందిన విమాన సంస్థ సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో వెలుగు చూసింది. ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఒకరు విమానంలో అందించిన ఆహారం తింటున్న సమయంలో అందులోని కూరలో పాము తల కనిపించింది. అది చూసి విమాన అటెండెంట్ హడలిపోయాడు.ఈ సంఘటన జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో జరిగిందని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అందులోని సిబ్బందికి ఈ అనుభవం ఎదురైనట్లు వెల్లడించింది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటున్న సమయంలో ఆలూ, ఆకుకూరలతో చేసిన కర్రీలో పాము తల కనిపించినట్లు ఆ విమాన అటెండెంట్ తెలిపాడు. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తలని చూసి ఎంతో భయపడ్డానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు’ పేర్కొన్నారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని విమానయాన సంస్థ పేర్కొంది. ఇంతకు ముందు ఆహారంలో నత్త కూరుకుపోయిందనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇలాంటి ఘటనే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కొనుగోలు చేసిన చికెన్ సలాడ్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు.
AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
విమాన భోజనంలో పాము తలకు సంబంధించి వార్తలు సరైనవి కావని సంబంధిత క్యాటరింగ్ సంస్థ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించబడిందన్నారు. వంట చేసేటప్పుడు విదేశీ వస్తువలను ఏదీ అందించలేదని వెల్లడించింది. భోజనం 280 డిగ్రీల సెల్సియస్‌లో వండుతారని.. కానీ ఆ పాము తల తాజాగా కనపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
https://twitter.com/DidThatHurt2/status/1551743925047754752?cxt=HHwWgIC8rZu484grAAAA
