NTV Telugu Site icon

Cargo Ship Fire Accident: రవాణానౌకలో అగ్నిప్రమాదం.. 2857 కార్లు దగ్ధం

Fremantle Cargo Ship Fire

Fremantle Cargo Ship Fire

Cargo Ship Fire Accident: బుధవారం వేలాది కార్లతో బయలుదేరిన ఓ కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ తీరంలో మంటల్లో చిక్కుకుంది. అనుకోకుండా సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మొత్తం 2857 కార్లు దగ్ధమయ్యాయి. మిగిలిన 23 సిబ్బంది సముద్రంలోకి దూకి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. అయితే.. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి ఎముకలు దెబ్బతినగా, మరొకందరికి మంటల్లో ఒళ్లు కాలింది. ఈ మంటల్ని అదుపు చేసేందుకు కోస్ట్ గార్డ్ తీవ్రంగా శ్రమిస్తోంది.

Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం

డచ్ అధికారుల సమాచారం ప్రకారం.. పనామాకు చెందిన ఫ్రీమాంటిల్ హైవే అనే కార్గో షిప్ జర్మనీ నుంచి ఈజిప్టుకు 2857 కార్లతో బయలుదేరింది. వీటిలో 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. నెదర్లాండ్స్ తీరం వరకు ఈ నౌక ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ, ఆ తీరం దగ్గరకు వచ్చిన అనుకోకుండా ఈ నౌకలో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది.. మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఒకదాని తర్వాత మరొక కారు దగ్ధమవుతూ మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో.. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో, ఆ నౌకలో ఉన్న సిబ్బంది ఏం చేయలేకపోయింది. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అందరూ సముద్రంలోకి దూకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒకరు ఒళ్లు కాలడంతో పాటు శ్వాస తీసుకోలేక మృతి చెందారు. మిగిలిన 23 మంది ఎలాగోలా ఆ ప్రమాదం నుంచి బయటపడి, తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. కాకపోతే.. వీరిలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Ileana D’Cruz: మరోసారి తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేసిన ఇలియానా..

ఈ నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక కారుకి నిప్పంటుకోవడం వల్లే, ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న డచ్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ మంటల్ని అదుపు చేయడం అంత సులువు కాదని, రోజులు తరబడి ఈ మంటలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Show comments