Finland PM Sanna Marin Drug Test: ఫిన్లాండ్ పీఎం సన్నా మారిన్ ఓ పార్టీలో డ్యాన్స్ చేయడం వివాదానికి దారి తీసింది. పార్టీలో సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారని ఫిన్లాండ్ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజెన్లు దీన్ని తప్పుపట్టారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని సనా మారిన్ డ్రగ్ టెస్ట్ చేయించుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలు తప్పని తేల్చేందుకు ఈ రోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇటీవల ఓ పార్టీలో ప్రధాని మారిన్ తో పాటు మరో ఆరుగురు మహిళలు డ్యాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రధాని మారిన్ నెలపై కూర్చొని డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాలను అక్కడి ప్రతిపక్షాలు వ్యక్తపరిచాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని సనా మారిన్ ఖండించారు. అయితే ప్రధాని పదవిలో ఉన్న మారిన్ అందుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సనా మారిన్ 34 ఏళ్ల వయసులో 2019లో ప్రధాని పదవిని చేపట్టారు.
Read Also: Union Minister Anurag Thakur: లిక్కర్ స్కామ్ లో అసలు నిందితుడు కేజ్రీవాలే..
సాయంత్రం స్నేహితులం అంతా కలిసి పార్టీ చేసుకున్నామని.. ప్రైవేటు పార్టీ వీడియోలు లీక్ కావడం దురదృష్టకరమని ఆమె అన్నారు. కేవలం ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నానని.. డ్రగ్స్ తీసుకోలేదని.. తాను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె వెల్లడించారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈరోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని.. వారం రోజుల్లో రిపోర్టు వస్తాయని.. వచ్చాక మీడియాతో పంచుకుంటానని ఆమె అన్నారు.
https://twitter.com/txtworld/status/1560286229882884097
