NTV Telugu Site icon

FIFA World Cup Final: రికార్డ్ క్రియేట్ చేసిన గూగుల్..

Google Record

Google Record

FIFA World Cup Final Records Highest Search Traffic, Says Google’s Sundar Pichai: ఫిఫా వరల్డ్ కప్ పుణ్యామా అని గూగుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇదే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ రికార్డ్ అని వెల్లడించారు. ఆదివారం జరిగిన ఫిఫా ఫైనల్ జరిగింది. దీని గురించే అత్యధిక మంది వెతికినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటల్లో ఒకటని.. మెస్సి ఆట అద్భుతం అని కొనియాడాడు.

Read Also: MIM Corporator Nephew Died: పాతబస్తీలో దారుణం.. MIM కార్పొరేటర్ మేనల్లుడి మృతి

ఖతార్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిన్న ఆదివారం జరిగింది. అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు ఫైనల్ కప్ కోసం పోరాడాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని సాధించింది. మూడు దశాబ్ధాల తరువాత ఛాంపియన్స్ గా నిలిచింది. లియోనాల్ మెస్సీ అద్భుత ఆటతీరుతో అర్జెంటీనాను గెలిపించాడు. ఖతార్ లోని లుసైన్ స్టేడియంలో 1.5 లక్షల మంది అభిమానులు ఆటను వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఫైనల్స్ ని వీక్షించారు.

ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ మూడో గోల్ చేసిన తర్వాత అత్యధికంగా ట్విట్టర్ లో ట్వీట్లు వచ్చినట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు. అత్యధికంగా సెకనుకు 24,400 ట్వీట్లు పోటెత్తాయి. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా-ఫ్రాన్స్ చెరో 3 గోల్స్ తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌల్ లో అర్జెంటీనా వరసగా నాలుగు గోల్స్ చేసి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ గెలుపు కోసం కైలియన్ ఎంబాపే చివరి వరకు పోరాడాడు. అయితే విజయం మాత్రం అర్జెంటీనాను వరించింది.