ఫేస్‌బుక్ ఎంట్రీ అయిన మొదట్లో పెద్దగా వివరాలు ఏమీ పొందుపర్చాల్సిన అవసరం ఉండేది కాదు.. అయితే, రాను రాను.. దీనిపై ఆంక్షలు ఎక్కువయ్యాయి.. పేరు, వయసు, అడ్రస్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, అభిరుచులు, రాజకీయ వ్యవహారాలు లాంటి వివరాలతో పాటు.. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అడుగుపెట్టాలంటే.. పెద్ద లిస్టే ఉంటుంది.. కానీ, ఫేస్‌బుక్ అకౌంట్ నిబంధనలకు సంబంధించి దాని మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్ ప్రొఫైల్ గురించి యూజర్లు తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..
Read Also: Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
అంటే, ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో మొదట అకౌంట్ తెరిచేందుకు కొన్ని వివరాలు సమర్పించాలి. ఇందులో పేరు, వయసు, అడ్రస్ వంటి వివరాలతోపాటు అభిరుచులు, ఇష్టమైన ప్రాంతాలు, వంటకాలు, పుస్తకాలు, సినిమాలు.. ఇలా పెద్ద లిస్టే ఉంటుంది.. ఇవి సేకరించడానికి కారణం కూడా ఉంది.. ఎందుకంటే.. వారి అభిరుచికి అనుగుణంగా.. పోస్టులు, యాడ్స్ కూడా వారికి కనిపించేలా చేస్తారన్నమాట.. యాజమాన్యం ఉద్దేశం ఏదైనా.. ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచేప్పుడు యూజర్లు వాటిని నింపేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది.. దీంతో, కొంతమంది చాలా విసుగు చెందితున్నారట.. అయితే, ఇప్పుడు కొన్ని కాలమ్స్‌ను తొలగించాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది.. అవి వచ్చే నెల అంటే డిసెంబర్ 1వ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
మెటా తాజా నిర్ణయం ప్రకారం.. యూజర్ ప్రొఫైల్‌లో మతపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలతోపాటు చిరునామా, జెండర్ వంటి వివరాలను ఇకపై తెలియజేయాల్సిన అవసరంలేదు. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించిన యూజర్లకు ఫేస్‌బుక్ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు పంపుతోంది. ఇకపై ఈ నాలుగు వివరాలు కనిపించవని, కొత్తగా ఖాతా తెరిచేవారు వీటి గురించి తెలియజేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.. అంటే మొత్తంగా కొత్తగా ఫేస్‌బుక్‌లో అడుగుపెట్టేవారికి ఊరటనే చెప్పాలి.
