NTV Telugu Site icon

Dam Blast: క‌ఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. వరద నీటిలో ఖేర్సన్ నగరం

Ukrine

Ukrine

Dam Blast: యుద్ధం అంటే ప్రజలు ఎంతో భయపడతారు. యుద్ధం వస్తే ఆయా దేశాల్లోని ప్రజలకు తీవ్ర కష్టాలు ఉంటాయి. సాధారణంగా యుద్ధంలో ఫిరంగులు.. క్షిపణులు.. తూటాలు.. తుపాకులను ఉపయోగిస్తారు. ఇపుడు కొత్తగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్దానికి నీటితో నిండి ఉన్న డ్యామ్‌ను పేల్చి ఆ నీటిని దేశంలోకి పంపించి వరదల్లో ప్రజల్లో చిక్కుకునేలా చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో క‌ఖోవ్కా డ్యామ్ ను పేల్చారు. దీంతో డ్యామ్‌కు దిగువన ఉన్న ఖేర్సన్‌ నగరం వరద నీటిలో మునిగిపోయింది. అయితే కఖోవ్కా డ్యామ్‌ను పేల్చింది ఎవరనేది తేల లేదు. నువ్వే పేల్చావని రష్యా అంటుంటే.. లేదు నువ్వే పేల్చావని ఉక్రెయిన్‌ రష్యా మీద ఆరోపణలు చేస్తోంది.

Read also: Manipur violence: మణిపూర్‌లో కూంబింగ్ ఆపరేషన్‌.. భారీగా ఆయుధాలు, బాంబులు స్వాధీనం

రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లాలంటే నీపర్‌ నదిపై ఉన్న ఈ డ్యాం కీలకం. ఈ డ్యామ్‌ను దాటే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రష్యా సైన్యం తమ దేశంలోకి రాకుండా ఉండటం కోసం ఉక్రెయిన్‌ డ్యామ్‌ను పేల్చివేసిందని రష్యా ఆరోపిస్తుండగా.. రష్యానే డ్యామ్‌ను పేల్చివేసిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుంది. మొత్తానికి రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేయడంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాలు వరద మయమయ్యాయి. సుమారు 60 వేల మంది వ‌ర‌ద ముంపులో ఉన్నట్లు తేలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఉక్రెయిన్‌ సైన్యం సహాయక చర్యలు అందిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read also: Fish Food Festival: నేడే ఫిష్ ఫుడ్ ఫెస్టివ‌ల్‌.. ముస్తాబైన సరూర్‌నగర్‌ స్టేడియం

ప్రస్తుతం ఖేర్సన్‌ నగరం తూర్పు ప్రాంతం రష్యా అధీనంలో ఉండగా.. పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్‌ అధీనంలో ఉంది. యుద్ధం ప్రారంభంలోనే రష్యా ఖేర్సన్‌ నగరం తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది. రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో సహాయక చర్యలు సక్రమంగా అందించడం లేదని ఉక్రెయిన్‌ దేశాధ్యక్షులు జెలెన్‌స్కీ విమర్శించారు. ఆనకట్ట కూల్చివేతను రష్యా అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. డ్యామ్ పేల్చివేత వ‌ల్ల ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని యూఎన్ చీఫ్ హెచ్చరించారు. సోవియేట్ కాలం నాటి నోవా క‌ఖోవ్కా డ్యామ్‌ను హైడ్రో ఎల‌క్ట్రిక్ స్టేష‌న్‌గా వాడుతున్నారు. ర‌ష్యా ఆక్రమ‌ణ‌దారులు కావాల‌నే హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ స్టేష‌న్‌ను పేల్చివేశార‌ని.. ఇది మాన‌వ‌ హ‌న‌న ప‌ర్యావ‌ర‌ణ బాంబుగా వీడియో సందేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్యామ్‌ను కూల్చినంత మాత్రాన త‌మ‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు.