NTV Telugu Site icon

Fidel Ramos: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ కన్నుమూత

Fidel Ramos

Fidel Ramos

Fidel Ramos: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ (94)ఆదివారం మధ్యాహ్నం కొవిడ్ సమస్యల కారణంగా మరణించారు. కరోనా సమస్యల కారణంగా ఆయన మకాటి మెడికల్ సెంటర్‌లో మృతి చెందారని మనీలా టైమ్స్ నివేదించింది. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ రొముల్డెజ్ మార్కోస్ ప్రెస్ సెక్రటరీ రోజ్ బీట్రిక్స్ క్రజ్- ఏంజెల్స్ రామోస్ మరణాన్ని ధ్రువీకరించారు.

Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?

మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ మరణించడం చాలా బాధగా ఉందని ఏంజెల్స్ అన్నారు. ఆయన ఓ సైనిక అధికారిగా, అధ్యక్షుడిగా దేశానికి ఎంతో సేవచేసి చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారని ఆమె వెల్లడించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఆయన ఆత్మకు శాంతించాలని దేవుడిని ప్రార్థిస్తామన్నారు. 1992-1998 వరకు ఫిలిప్ఫీన్స్ 12వ అధ్యక్షుడిగా రామోస్ ఆ దేశానికి సేవలందించారు. ఆయన కాలంలోనే ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థ గొప్పగా వర్థిల్లిందని మనీలా టైమ్స్ ప్రకటించింది. రామోస్ ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించే వరకు ఎదిగాడు.