NTV Telugu Site icon

Russia Ukraine War: భారత విద్యార్థులు, పౌరులకు కేంద్రం కీలక సూచనలు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్.

Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తుందని పేర్కొంది.. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హుజూర్ద్, చెర్నీ వేస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.. స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు జట్టులుగా, బృందాలుగా బయలుదేరాలని పేర్కొంది హంగేరిలోని రాయబార కార్యాలయం.. భారతీయ పౌరులు, విద్యార్థులు పాస్ పోర్టులు, డాలర్లు (ప్రధానంగా అమెరికా డాలర్లు) అత్యవసర ఖర్చుల కోసం, ఇతర అవసరాల కోసం వెంట ఉంచుకోవాలని సూచించింది.. ఇక, “కరోనా” వ్యాక్సిన్‌ డబుల్ డోస్‌ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది.. భారత జాతీయ జెండా ప్రింటు కాపీలను తాము ప్రయాణిస్తున్న వాహనాలపై అతికించాలని సూచించింది.