Site icon NTV Telugu

Starlink Satellites: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లపై “సౌర తుఫాన్” ప్రభావం..

Starlink Satellites

Starlink Satellites

Starlink Satellites: రెండు దశాబ్ధాలకు పైగా సంభవించిన సౌర తుఫానుల్లో ఒకటి శుక్రవారం భూమిని తాకింది. యూరప్, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు ప్రపంచంలోనే పలు ప్రదేశాల్లో దీని ఫలితంగా శక్తివంతమైన అరోరాలు ఏర్పడ్డాయి. సూర్యుడి నుంచి కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) కారణంగా ప్లాస్మా, బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ భూమి వైపు దూసుకువచ్చి జియో మాగ్నెటిక్ స్ట్రోర్మ్( భూ అయస్కాంత తుఫాను)కి కారణమైంది. దీని ప్రభావం వారాంతం వరకు కొనసాగుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ నేపథ్యంలో ఈ బలమైన జియోమాగ్నెటిక్ తుఫాన్ వల్ల శాటిలైట్లకు, పవర్ గ్రిడ్స్‌కి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

Read Also: PM Modi: ఒడిశా సీఎంకు జిల్లాల పేర్లు తెలుసా? నవీన్ పట్నాయక్‌కు సవాల్

ఎలాన్ మస్క్‌ స్పేస్ఎక్స్‌కి చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు ఈ భారీ జియోమాగ్నెటిక్ తుఫానుకు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. తుఫాను శాటిలైట్లను తాకడంతో సేవలు దిగజారే అవకాశం ఉందని వినియోగదారుల్ని హెచ్చరించింది. ‘‘ స్టార్‌లింక్ ప్రస్తుతం క్షీణించిన సేవల్ని అనుభవిస్తోంది. మా బృందం దర్యాప్తు చేస్తోంది’ అని కంపెనీ వెబ్‌సైట్‌లో రాసింది. అంతకుముందు ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని హైలెట్ చేశారు. సౌర తుఫాన్ తీవ్రత స్టార్‌లింక్ శాటిలైట్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసిందని, చాలా కాలం నుంచి ఇది చాలా పెద్దదని తుఫాను గురించి అభివర్ణించారు. US నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అక్టోబర్ 2003 తర్వాత భూమిని తాకిన అతిపెద్ద సౌర తుఫాన్ ఇదే అని చెప్పింది. దీని వల్ల నావిగేషన్, పవర్ గ్రిడ్స్, శాటిలైట్లు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పింది.

Exit mobile version