Elon Musk: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాజాగా ఓటింగ్ ముగిసి, ఫలితాలు వెలువడుతోన్న సందర్భంగా ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అని రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని మస్క్ వెల్లడించారు.
Read Also: Yash: కోర్టు మెట్లెక్కిన యశ్, రాధిక పండిట్.. ఏమైందంటే?
అయితే, మరోవైపు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎలాన్ మస్క్ ఎలక్షన్ గివ్ అవే కింద ప్రైజ్ మనీ స్కామ్ ను ప్రవేశ పెట్టారు. ఆ ప్రైజ్‌మనీ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్నీ లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు కాకుండా ముందుగానే నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్‌మనీ ఇస్తున్నారని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిన్ మెక్‌అఫెర్జీ ఎలాన్ మస్క్ పై దావా వేసింది.
Game, set and match
— Elon Musk (@elonmusk) November 6, 2024