Site icon NTV Telugu

Elon Musk: అమ్మాయిగా మారిన ఎలన్ మస్క్ కుమారుడు.. పేరు మార్పు కోసం దరఖాస్తు

Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, తన మాజీ భార్య జస్టిన్ విల్సన్‌ 2008లోనే విడాకులు తీసుకున్నారు. 2000లో పెళ్లి చేసుకున్న ఎలన్ మస్క్ దంపతులకు విడాకులు తీసుకునే నాటికి అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అలెగ్జాండర్ కొంతకాలం క్రితం లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. ప్రస్తుతం అలెగ్జాండర్‌కు 18 ఏళ్లు. ఈ మేరకు తన పేరును కూడా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. దీంతో తన తండ్రితో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని భావిస్తున్నట్లు అలెగ్జాండర్ తెలిపాడు. వివియన్ జెన్నా విల్సన్ పేరుతో కొత్తగా తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

కాగా ఇటీవల ట్రాన్స్‌జెండర్లపై ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతిస్తోన్న రిపబ్లికన్‌ పార్టీకి తాను మద్దతు ఇస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. 2020లోనూ ఇదే అంశంపై మాట్లాడిన ఎలాన్‌ మస్క్‌.. ట్రాన్స్‌జెండర్లకు పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్‌ చేశారు. కానీ ట్రాన్స్‌జెండర్లు వారి పేర్లను మార్చుకోవడం మాత్రం ఓ అందమైన పీడకలేనంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు.

Indonesia: డేటింగ్ యాప్‌లో చాట్.. పెళ్లయ్యాక పెద్ద షాక్!

Exit mobile version