NTV Telugu Site icon

Elon Musk: ట్విట్టర్ సీఈఓకు ఎలాన్ మస్క్ బెదిరింపులు

Elon Musk Parag Agarwal

Elon Musk Parag Agarwal

Elon Musk sent warning to twitter CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చినప్పటి నుంచి ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కొనుగోలు ఒప్పదంలో అనేక ఉల్లంఘనల కారణంగా మస్క్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్విట్టర్, ఎలాన్ మస్క్ మధ్య లీగల్ బ్యాటిల్ ప్రారంభం అయింది.

తాజాగా ఎలాన్ మస్క్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడంపై ట్విట్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉంటే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కు ఓ బెదిరింపు సందేశం పంపాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మీ లాయర్లు ఈ వివాదంతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని ఆపేయాలని మస్క్, పరాగ్ అగర్వాల్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ కోర్టులో కేసు వేసింది. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ మస్క్ పై పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

Rad Also: Twitter: ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. వదిలేది లేదంటున్న ట్విట్టర్‌..!

ఏప్రిల్ నెలలో ట్విట్టర్, ఎలాన్ మస్క్ మధ్య డీల్ కుదిరింది. ఒక్కో షేర్ కు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్ డాలర్లు చెల్లించి ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలని మస్క్ అనుకున్నాడు. అయితే దాదాపుగా 5 శాతం ఫేక్ అకౌంట్లు ఉన్నాయని ఈ డీల్ ను గతంలో తాత్కాలికంగా మస్క్ నిలిపివేశాడు. నకిలీ ఖాతాలపై వాస్తవాలను తెలుసుకోవడానికి మస్క్ మేలో ఈ ఒప్పందాన్ని నిలిపివేశాడు. ప్రస్తుతం ట్విట్టర్, ఎలాన్ మస్క్ మధ్య న్యాయపోరాటం జరగనుంది. ప్రస్తుతానికి ట్విట్టర్ కొనుగోలు చేయాలనుకున్న ఎలాన్ మస్క్ ఈ డీల్ నుంచి పక్కకు జరిగారు.