NTV Telugu Site icon

Elon Musk: మిస్టర్ ట్వీట్‌గా పేరు మార్చుకున్న మస్క్.. ఇదేమైనా కామెడీ ఛానలా?

Elon Musk Mister Tweet

Elon Musk Mister Tweet

Elon Musk Changed His Twitter Account Name As Mister Tweet: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందులో రకరకాల మార్పులు చేస్తూనే ఉన్నాడు. యూజర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ‘పోల్‌’ను ప్రారంభించిన మస్క్.. ‘టిక్’ విషయంలోనూ మూడు రంగుల్ని తీసుకొచ్చాడు. అంతేకాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, సెలెబ్రిటీలు, ఇతరులకంటూ కొన్ని ప్రత్యేకమైన కేటగిరీల్ని తీసుకొచ్చాడు. ఇంకా చిత్రవిచిత్ర మార్పులకు తెరలేపుతున్న మస్క్.. లేటెస్ట్‌గా యూజర్లను ఆటపట్టించేందుకు మరో కొత్త డ్రామా మొదలుపెట్టాడు.

Kangana Ranaut: నా జీవితం నాశనమైనా.. తిరిగి నిలబడే సత్తా ఉంది

తన ట్విటర్‌ ఖాతాలో పేరును ‘మిస్టర్‌ ట్వీట్‌’గా మార్చుకున్న మస్క్‌.. తిరిగి తన పేరును మార్చుకోలేకపోతున్నానని ప్రకటించాడు. ‘‘నా పేరును మిస్టర్‌ ట్వీట్‌గా మార్చుకున్నా. కానీ.. ఇప్పుడు దాన్ని తిరిగి మార్చుకోవడం కోసం ట్విటర్ అనుమతించడం లేదు’’ అంటూ స్మైలీ ఎమోజీతో ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు వేల సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘ఈ ట్విటర్ వేదికను కామెడీ ఛానల్‌గా మారుస్తున్నారా..?’’ అంటూ మస్క్‌కి ఓ యూజర్ ప్రశ్నించగా.. ‘‘ఇది నిజంగా హాస్యాస్పదం’’ అని మరొకరు పేర్కొన్నారు. ట్విటర్‌ని కొనుగోలు చేసిన నీకు, నీ ఖాతా పేరు మార్చుకోవడానికి వీలు పడట్లేదా, ఇది చాలా కామెడీగా ఉందంటూ యూజర్లు మస్క్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.

Emirates Airlines: విమానం గాల్లో ఉండగా పురిటినొప్పులు.. కట్ చేస్తే!

ఇదిలావుండగా.. ట్విటర్‌లో మరికొన్ని కీలక మార్పులు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని ఎలాన్ మస్క్ ఇటీవలే పేర్కొన్నాడు. రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు, ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌలభ్యం కల్పించనున్నట్లు మస్క్‌ వెల్లడించారు. చూస్తుంటే.. తన ట్విటర్‌కు గ్లోబల్‌గా మరింత పాపులారిటీ తెచ్చుకోవడం కోసమే ట్విటర్ ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలకు పాల్పడుతున్నాడని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Bryan Johnson: 45 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు రివర్స్ గేర్.. ఎంత ఖర్చో తెలుసా?