Site icon NTV Telugu

మ‌ర‌ణం గురించి ఎల‌న్ మ‌స్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు… ఎక్క‌డ చ‌నిపోవాల‌నుకుంటున్నాడంటే…

ఎల‌న్ మస్క్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.  వ్యాపార‌వేత్త‌గా మాత్ర‌మే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో అంత‌రిక్ష సంస్థ‌ను స్థాపించి స్పేస్ గురించిన ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు.  నాసాతో క‌లిసి అనేక ప్రాజెక్టుల‌ను స్పేస్ ఎక్స్ సంస్థ చేప‌డుతున్న‌ది.  రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మ‌నుషుల‌ను అంగార‌కుడిపైకి తీసుకెళ్లాల‌నే ల‌క్ష్యంతో స్సేష్ షిప్ ను త‌యారు చేస్తున్నారు.  ఈ స్పేస్ షిప్ ప‌నులు వేగంగా సాగుతున్నాయి.  ఈ రీయూజ‌బుల్ స్పేస్‌షిప్ ద్వారా 100 మందిని అంగార‌కుడిమీద‌కు తీసుకెళ్లాల‌న్న‌ది ఆయ‌న సంక‌ల్పం.  స్పేస్‌లో ప్ర‌యాణ‌లంటే మాట‌లు కాదు, ప్రాణాల‌తో చెల‌గాటం వంటిదే.  త‌న‌కు మ‌ర‌ణం అంటే భ‌యం లేద‌ని, అయితే, తాను అంగార‌కుడిపై మ‌ర‌ణించాల‌ని బ‌లంగా కోరుకుంటున్నాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా ఎల‌న్ మ‌స్క్ పేర్కొన్నారు.  ఎల‌న్ మ‌స్క్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.  

Read: పవర్ స్టార్ టైటిల్ వాడేసుకుంటోన్న బాలీవుడ్ బ్యూటీ!

Exit mobile version