Site icon NTV Telugu

పిల్లలపై ప్రేమ… మొసలిపై పగ.. ఏనుగు ఏం చేసిందంటే?

ఎంత లోకల్ అయినా.. ఒక్కోసారి నాన్ లోకల్ చేతిలో ఓడిపోవాల్సిందే అని నిరూపించే ఘటన ఇది. మొసలికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. అయితే అలాంటి మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపడం సంచలనంగా మారుతోంది. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘటన జరిగి రెండునెలలు అవుతున్నా.. ఈ వీడియో మాత్రం వైరల్‌ అవుతూనే వుంది. పురాణాల్లో మొసలి చేతిలో చిక్కి గజరాజు ఆ విష్ణుమూర్తి సాయం కోరిన సంగతి అందరికీ తెలిసిందే. గజేంద్రమోక్షం గురించి అంతా చదివే వుంటాం. కానీ మనం ఇప్పుడు చదువుతున్నది మాత్రం మొసలి మరణం అనాలేమో. సాధారణంగా అడవుల్లో వుండే ఏనుగులు నీటి కోసం నదుల వైపునకు వెళతాయి.

నీళ్లు తాగడానికి తన పిల్లలతో కలిసి ఏనుగు నదిలోకి దిగింది. తన ప్లేస్‌లోకి వచ్చిన ఏనుగు పిల్లలను పట్టేందుకు ప్రయత్నించింది ఓ మొసలి. ఈ ప్లేస్ నాదే కదా.. ఇక్కడికి ఎవరైనా వస్తే ఓ పట్టుపట్టాల్సిందేనని భావించిన మొసలికి గర్వభంగం అయింది. ఏనుగు పిల్లలపై దాడిచేసిన మొసలికి ప్రాణభయం పట్టుకుంది. ఒక్కసారిగా మొసలిపై తల్లి ఏనుగు దాడి చేసింది. తన తొండం, కాలితో మొసలి ప్రయత్నం వర్కవుట్ కాలేదు.

తన బలమయిన పాదాలతో మొసలిని తొక్కి తొక్కి మరీ చంపేసింది. దీనిని అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. తల్లి ఏనుగు మాత్రం మొసలి చచ్చిందని నిర్ధారించుకున్న తర్వాతనే బయటకు వచ్చింది. ఎంత లోకల్ అయినా అన్ని వేళలా అది వర్కవుట్ కాదు. పాపం మొసలి… తన అడ్డాలోనే మరణించక తప్పలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version