Japan Earthquake: ప్రపంచంలో రోజు ఎక్కడో చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీ భూకంపం తర్వాత భూకంప మాట వింటనే జనాలు హడలిపోతున్నారు. శనివారం టర్కీలో 5.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. 66 గంటల వ్యవధిలోనే 37 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా జపాన్ లోని హక్కైడోలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం జపాన్ లోని ఉత్తర ద్వీపం హక్కైడోలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. నెమురో ద్వీపకల్పంలో 61 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎర్త్ సైన్స్ అండ్ డిజాస్టర్ రెసిలెన్స్ వెల్లడించింది.
Read Also: Rashmi Gautam: చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తా.. యాంకర్ రష్మీకి బెదిరింపులు
అయితే అధికారులు మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. జపాన్‌లోని ప్రధాన ఉత్తర దీవుల్లో ఒకటైన హక్కైడో కొద్దిరోజుల క్రితం భూకంపం సంభవించింది. సోమవారం 5.1 తీవ్రతో భూకంపం వచ్చింది. జపాన్ లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. జపాన్ భూభాగం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ అధికంగా ఉండే ప్రాంతంలో ఉంది. ‘ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్ లో జపాన్ ఉంది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వల్ల భూకంపాలు వస్తుంటాయి.