Site icon NTV Telugu

Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. హడలెత్తిపోతున్న ప్రజలు

Earthquakeafghanistan

Earthquakeafghanistan

ఆప్ఘనిస్థాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం నుంచే ఇంకా తేరుకోలేదు. తాజాగా గురువారం కూడా మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదైంది. 135 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Supreme Court: చెట్లు నరకడం వల్లే ఈ దుస్థితి.. వరదలపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు

బుధవారం రాత్రి కూడా 4.3 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చిందని.. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ 4.8 తీవ్రత భూకంపం వచ్చినట్లుగా అధికారులు చెప్పారు. ఇటీవల వచ్చిన భూకంపంతోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తేరుకునేలోపే వరుస భూప్రకంపనలు రావడంతో హడలెత్తిపోతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.  అలాగే మయన్మార్‌లో కూడా భూకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Cheating: ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు

ఇక ఆదివారం-సోమవారం అర్ధరాత్రి వచ్చిన భూకంపం తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించింది. దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 1400 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే శిథిలాల తొలగింపు కూడా కొనసాగుతోంది.

 

Exit mobile version