NTV Telugu Site icon

Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు

Earthquakes2

Earthquakes2

మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం… ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూప్రకంపం చోటుచేసుకుంది. భూకంపం 180 కి.మీ లోతులో సంభవించినట్లుగా తెలిపింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా సంభవించిందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Earthquakes: 150కి చేరిన మయన్మార్, బ్యాంకాక్ భూకంప మృతుల సంఖ్య

ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 150 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నేపిడా నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కి.మీ దూరంలో ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్‌, థాయ్‌లాండ్ దేశాలు గజగజ వణికిపోయాయి.