మరోసారి వరుస భూకంపాలు వణికిస్తున్నాయి.. నిన్న నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది.. దాదాపు 10 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోంది.. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. బుధవారం తెల్లవారు జామున 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3తీవ్రతగా నమోదైంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు రాగా.. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.. ఈ భూకంపం భారతదేశంలోని పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు ఈశాన్యంగా 158 కిమీ (98 మైళ్ళు) కేంద్రీకృతమై ఉంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సీస్మాలజీ సెంటర్ ప్రకటించింది.
Read Also: T20 World Cup Semi-Final: భారత్-న్యూజిలాండ్ మధ్య కీలక ఫైట్.. గెలిస్తేనే ఫైనల్ లేదంటే ఇంటికే..
ఇక, నేపాల్‌లో 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది.. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.