NTV Telugu Site icon

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదు

Kde

Kde

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. జూలై 1న మధ్యాహ్నం 3:51 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 139 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఏమైనా ప్రాణనష్టం జరిగిందా? ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు. రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: US Politics: యూఎస్ రిపబ్లికన్ పార్టీలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత..

ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్‌లో వరుస భూకంపాలతో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆ మధ్య కాలంలో కొండచరియలు విరిగిపడి కూడా పదులకొద్ది మృత్యువాత పడ్డారు. తాజా భూకంపంలో ఎలాంటి నష్టం జరిగిందన్న దానిపై సమాచారం రావల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Aadi Srinivas : కేసీఆర్‌ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు.. 

Show comments