NTV Telugu Site icon

Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

Earthquake

Earthquake

రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్టాయ్ రిపబ్లిక్‌లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం ఫిబ్రవరి 15, 2025 శనివారం రష్యాలోని నైరుతి సైబీరియాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో సంభవించినట్లుగా పేర్కొంది. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు వెల్లడించలేదు.