మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది.. ఈ నెలలో దాదాపు నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించగా… ఇవాళ ఉదయం 6.73 గంటల ప్రాంతంలో మరోసారి తీవ్రమైన భూకంపం వచ్చింది… దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.. సులవేసి కొటమోబాగుకు 779 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. కాగా, ఈ మధ్య ఇండోనేషియాను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి.. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.. అయితే, ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగింది.. ఆస్తినష్టం ఎంత..? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? లాంటి పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Read Also: Krishna Mohan Reddy: మాకు సంబంధం లేదు.. సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకోలేదు..