Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాల్లో వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు వారాల క్రితం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1000 పైగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీంతో టర్కీ, సిరియా దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 46,000లను దాటింది. రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. శిథిలాలు తొలిగే కొద్దీ తమ వారు బతికుంటారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కొన్ని చోట్ల అద్భుతాలు జరిగి కొంతమంది ప్రాణాలతో బయటపడుతున్నారు.
Read Also: Amit Shah: మోదీ ఫోటోతో ఓట్లు అడిగి.. కాంగ్రెస్,ఎన్సీపీ కాళ్లు పట్టుకున్నారు.
345,000 భవనాలు దెబ్బతిన్నట్లుగా టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. గత దశాబ్ధంగా అంతర్యుద్ధాని ఎదర్కొంటున్న సిరియా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే తీవ్రవాదంతో సతమతం అవుతున్న సిరియా, ఇప్పుడు భూకంపంతో తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు భూకంప కారణంగా టర్కీలో ఇప్పటిదాకా 40,402 మంది మరణించగా, సిరియాలో 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా భూకంపం సంభవించి 12 రోజులు గడవడంతో సహాయకచర్యలకు నిలిపేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగి రోజులు గడుస్తుండటంతో ఇక శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఆదివారంతో రెస్క్యూ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ తెలిపారు.