Site icon NTV Telugu

Russia: భారీ భూకంపంతో దెబ్బతిన్న రష్యా అణు సబ్ బేస్!

Russia

Russia

రష్యాలో గత వారం భారీ భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు జారీ అయ్యాయి. ఇక నగరాలు.. నగరాలే ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక పసిఫిక్ సముద్ర తీరంలో భారీ నష్టాన్ని చవిచూసింది.

ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం

అయితే భూకంపం సందర్భంగా రష్యా అణు సబ్ బేస్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కమ్చట్కా ద్వీపకల్పంలోని రైబాచియ్ జలాంతర్గామి స్థావరంలో తేలియాడే పైర్‌కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ మేరకు వాణిజ్య ఉపగ్రహ ఇమేజింగ్ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫొటోల్లో కనిపిస్తున్నట్లుగా ఓ వార్తాపత్రిక నివేదించింది. ఓడరేవులోని ఒక భాగం దాని యాంకర్ పాయింట్ నుంచి విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఓడరేవు కూడా భారీగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. అంతే తప్ప పెద్ద విధ్వంసం జరిగినట్లుగా కనిపించలేదు. అయితే దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.

ఇది కూడా చదవండి: Tollywood : మన సినిమాలు.. మనకే తిరిగి చూపిస్తున్న ఇతర ఇండస్ట్రీలు

గత బుధవారం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అత్యంత శక్తివంతమైన భూకంపం కారణంగా ఫ్రెంచ్ పాలినేషియా-చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం ద్వీపకల్పంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇదే అతి పెద్ద భూకంపం అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Exit mobile version