NTV Telugu Site icon

Earth-Sized Planet: 40 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహం..జీవానికి ఛాన్స్..

Gliese 12 B

Gliese 12 B

Earth-Sized Planet: ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విశాల విశ్వంలో భూమి లాంటి గ్రహాలను కనుక్కోవాలనే ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు కొన్న వందల ఎక్సో ప్లానెట్లను కనుగొన్నప్పటికీ, అవి పూర్తిగా భూమి లాంటి లక్షణాలను కలిగి లేవు. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ‘‘గ్లీస్ 12బి’’ అనే నివాసయోగ్యమైన ఎక్సో‌ప్లానెట్‌ని కనుగొన్నారు. రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రచురించిన నివేదిక ప్రకారం.. గ్లీస్ 12బి భూమి కన్నా కొంచెం చిన్నగా శుక్రుడి పరిమాణంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహంపై ఉపరితల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని, ఇది భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15 డిగ్రీల కన్నా ఎక్కువ.

Read Also: Kia EV3: కియా ఈవీ3 రివీల్.. ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ రేంజ్..

అయితే, ప్రస్తుత గ్లీస్ 12బీ భూమి లాంటి వాతావరణం కలిగి ఉంటుందా..? అనేది ప్రశ్న. భూమి లాంటి నివాసయోగ్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని, అదే సమయంలో వీనస్‌లా మండే వాతావరణాన్ని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లని నక్షత్రాల చుట్టూ తిరిగే భూమి పరిమాణం లాంటి గ్రహాలు వాటి వాతావరణాన్ని నిలుపుకోగలవా అని అధ్యయనం చేయడానికి గ్లీన్12బీ మంచి ఉదాహరణగా శాస్త్రవేత్తలు భావిస్తు్న్నారు. మన గెలాక్సీ అంతట ఉన్న గ్రహాలపై నివాసయోగ్యతపై మన అవగాహనను పెంచుకోవడానికి కీలమైన దశగా ఆస్ట్రేలియాలోని సదరన్ క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోఫిజిక్స్ సెంటర్‌లో డాక్టరల్ స్టూడెంట్ శిశిర్ ధోలాకియా అన్నారు. పరిశోధన బృందానికి ఇతను సహ నాయకత్వం వహించారు.

గ్లీస్ 12 బీ సూర్యుడి పరిమాణంలో 27 శాతం ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. మన సూర్యుడిలో 60 శాతం ఉపరితల ఉష్ణోగ్రతను మాత్రమే కలిగి ఉంది. అయితే, ఈ గ్రహం తన నక్షత్రం నుంచి ఉన్న దూరం, భూమి-సూర్యుడికి మధ్య ఉండే దూరంలో 7 శాతం మాత్రమే అని, దీంతో భూమి సూర్యుడి నుంచి గ్రహించే శక్తి కన్నా 1.6 రెట్లు అధిక శక్తిని పొందుతోంది. ఇక శుక్రుడి గ్రహించే శక్తితో పోలిస్తే 85 శాతం శక్తిని గ్రహిస్తోంది.