NTV Telugu Site icon

Netherlands: బీచ్‌లో సెక్స్‌.. నెదర్లాండ్స్‌లోని ఓ పట్టణంలో వ్యతిరేకంగా ప్రచారం..

Dutch Town

Dutch Town

Netherlands: యూరోపియన్ దేశం నెదర్లాండ్స్ లోని ఓ పట్టణంలో ప్రజల డిమాండ్ కు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. దేశంలోని వీరే పట్టణంలోని సముద్రం బీచ్ లో సెక్స్ కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు గళమెత్తారు. బీచుల్లో పబ్లిక్ గా సెక్స్ చేయడంపై అక్కడి స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి వ్యతిరేకంగా బీచుల్లోని ఇసుకదిబ్బలు, ఇతర ప్రాంతాల్లో సెక్స్ లో పాల్గొనకుండా నిరొధించే ప్రచారాన్ని ప్రారంభించారు.

Read Also: Facebook: ‘మాకు నమ్మకం లేదు దొర’.. మార్క్ జుకర్‌బర్గ్‌పై ఫేస్‌బుక్ ఉద్యోగుల అసంతృప్తి

స్థానికుల అభ్యంతరం మేరకు బీచుల్లో సెక్సును నిషేధిస్తున్నట్లు సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షణను పెంచింది. ‘ప్రాజెక్ట్ ఒరాంజెజోన్’ అనే పేరుతో ప్రచారం ద్వారా మున్సిపాలిటీ, వాటర్ బోర్డులకు బీచులో చేసే లైంగిక చర్యల గురించి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. వీరే మేయర్ ఫ్రెడరిక షౌవెనార్ మాట్లాడుతూ.. బీచ్ లోని ఇసుక దిబ్బలు స్థానికులకు చాలా ముఖ్యమైనవని, పర్యావరణాన్ని దెబ్బతీసే, ఇతర పర్యాటకులకు భంగం కలిగించేలా అవాంఛనీయ ప్రవర్తన నిషేధిస్తున్నామని తెలిపారు. మేయర్ తీసుకున్న చర్యలపై వీరే మున్సిపాలిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, మేయర్ ని అభినందిస్తున్నారు. లైంగిక కార్యకలాపాలను, సన్ బాత్ నుంచి దూరం చేయాలని అక్కడి ప్రజలు కోరుకున్నారు.

NFN ఓపెన్ ఎన్ బ్లూట్ (ఓపెన్ అండ్ బేర్) నేక్డ్ రిక్రియేషన్ అసోసియేషన్ ప్రతినిధి కార్లియన్ లోడ్‌విజ్క్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశంలో సెక్స్ అనేది వినోదం కాదని, సన్ బాత్ కు వచ్చే ఇతర పర్యాటకులకు ఇది ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. నేకెడ్ రిక్రియేషన్ అనేది స్వేచ్ఛ యొక్క నిజమైన అనుభూతిని అందిస్తుందని, అయితే బహిరంగ సెక్స్ ను దీని నుంచి దూరం చేస్తామని అన్నారు.

Show comments