NTV Telugu Site icon

అక్క‌డ మేఘాల‌కే క‌రెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…

సాధార‌ణంగా గ‌ల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుంది.  సాధార‌ణ రోజుల్లోనే ఉద‌యం స‌మ‌యంలో వేడి 50 డిగ్రీల వ‌ర‌కు ఉంటుంది.  ఆ వేడి నుంచి త‌ట్టుకోవాలి అంటే ఏసీలు వేసుకున్నా స‌రిపోదు.  అందుకే చాలామంది ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి సందేహిస్తుంటారు.  ఏడారిలో వ‌ర్షం కురిసింది అంటే ఇక పండ‌గే పండ‌గా.  వేడి పెరిగిపోతుండ‌టంతో కృత్రిమంగా వ‌ర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావ‌ర‌ణ శాఖ వినూత్న‌మైన ప్ర‌యోగం చేసింది.  మేఘాల్లోకి ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన డ్రోన్‌ల‌ను పంపి క‌రెంట్ షాక్ ఇచ్చేలా చేశారు.  ఇలా డ్రోన్ స‌హాయంతో మేఘాల‌కు క‌రెంట్ షాక్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చి మేఘావృత‌మ‌య్యి వ‌ర్షం కురిసింది.  ఉన్న‌ట్టుండి హ‌టాత్తుగా వ‌ర్షం కుర‌వ‌డంతో ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోను దుబాయ్ వాతావ‌ర‌ణ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 

Read: నా(రప్ప)న్నకు ప్రేమతో: దగ్గుబాటి ఆశ్రిత!