Site icon NTV Telugu

Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ దుబాయ్ షట్ డౌన్..

Dubai Airport

Dubai Airport

Dubai International Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుగా పేరున్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్ అయింది. ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయిల్, యూఎస్ కలిసి సమన్వయ దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది.

Read Also: Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

ముఖ్యంగా గల్ఫ్‌లో ప్రధాన నగరాలైన రియాద్, అబుదాబీ, దుబాయ్, ఖతార్ సిటీలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా వారి గగనతలాన్ని మోసేశాయి. ఆ దేశాల గగనతలంలోకి ఎలాంటి విమానాలు రాకుండా ఎయిర్ స్పేస్ మూసేశాయి. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు శనివారం అన్ని కార్యకలాపాలను నిరవధికంగా నిలిపేసింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ (DWC) షట్‌డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి నోటీసు వచ్చేవరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని సూచించింది.

Exit mobile version