NTV Telugu Site icon

మళ్లీ డ్రోన్‌ కలకలం.. ఈసారి భారత ఎంబసీ వద్ద..

Indian High Commission

Indian High Commission

భారత్‌పై పాకిస్థాన్‌ ఎప్పుడూ ఏదో ఓ కుట్రలకు పాల్పడుతూనే ఉంటుంది.. పాక్ ఉగ్ర సంస్థలు కొత్త తరహాలో భారత్‌పై టార్గెట్‌ చేయడం.. వాటిని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది.. కొన్ని సమయాల్లో ప్రాణ నష్టం తప్పని పరిస్థితి.. గత కొంతకాలంగా క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు విహరిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జమ్మూ ఎయిర్‌ ఫోర్స్ స్టేష‌న్‌పైన కూడా డ్రోన్ల దాడి జ‌రిగింది. ఎయిర్‌బేస్‌పై జ‌రిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు జేషే మొహ‌మ్మద్‌, ల‌ష్కరే తోయిబాల హ‌స్తం ఉన్నట్లు శ్రీన‌గ‌ర్‌లోని 15 కార్ప్స్ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ పాండే వెల్లడించారు.. అయితే, ఇప్పుడు పాక్‌లోని భారతీయ ఎంబసీ దగ్గర డ్రోన్‌ కలకలం సృష్టించింది… జూన్ 26వ తేదీన పాక్‌, ఇస్లామాబాద్‌లోని భార‌తీయ ఎంబసీ వ‌ద్ద ఉన్న రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో డ్రోన్ క‌నిపించిన‌ట్టు తెలుస్తోంది. జ‌మ్మూలోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి కూడా అదేరోజు జరిగింది.. ఆ త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో ప‌లుమార్లు డ్రోన్లను భ‌ద్రతా ద‌ళాలు గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా, గత రెండు సంవత్సరాలుగా.. పాకిస్థాన్‌ డ్రోన్లను సరిహద్దు మీదుగా ఆయుధాలు వేయడానికి ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తరచూ డ్రోన్ వీక్షణలను నివేదించింది.. గత కొన్ని నెలల్లో కొన్నింటిని కాల్చివేసిన విషయం విదితమే.