డ్రైవర్ బాధ్యత చాలా గొప్పది.. ఎందుకంటే.. తాను నడిపే వాహనంలో ఉన్న ప్రాణాలు డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత పడ్డ సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు అనుకోని ప్రమాదం జరిగితే.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రయాణికుల ప్రాణాలు కాపాడేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే యాంగ్ యోంగ్.. చైనా బుల్లెట్ ట్రైన్ గురించి దాని స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ట్రైన్ వేగంగా వెల్లడాన్ని బట్టే దానికి బుల్లెట్ ట్రైన్ అని నామకరణం చేశారు. అయితే ఇలాంటి ఓ బుల్లెట్ ట్రైన్‌కే డ్రైవర్ యాంగ్ యోంగ్.. అయితే యాంగ్ యోంగ్ నడిపిస్తున్న బుల్లెట్ ట్రైన్ 144 మందితో బయలు దేరింది.
గ్వాఝూలోని రోంగ్జియాంగ్ రైల్వేస్టేషన్ కు సమీపంలోని సొరంగంలోకి ప్రవేశించగానే యాంగ్ యోంగ్.. పట్టాలమీద రాళ్లు, బురద, మట్టిపెళ్లలున్నట్టు గుర్తించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయగా.. ఆ రైలు వాటిని ఢీకొట్టి 900 మీటర్ల పాటు జారుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత పట్టాలు తప్పి స్టేషన్ లోని ప్లాట్ ఫాంను ఢీకొట్టడంతో ఆ డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదంలో యాంగ్ చనిపోగా 8 మంది గాయపడ్డారు. మిగతా వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. కాగా, యాంగ్ స్వస్థలమైన జూన్యీకి అతడి మృతదేహాన్ని తరలిస్తుండగా.. స్థానికులు వీధుల్లో నిలబడి సెల్యూట్ తో వీడ్కోలు పలికారు. అంతేకాకుండా ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేశావా అంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
https://twitter.com/Michael04222710/status/1533649242807537666?s=20&t=B-R6ESYBvlZcegiXogvxpg
