Site icon NTV Telugu

Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి దారుణంగా హత్య చేసిన డ్రైవర్..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ దేశంలో హిందూ మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. అక్కడ మైనారిటీ హక్కులను కాలరాస్తున్న అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ లో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు ధరమ్ దేవ్ రాతిని అతడి డ్రైవర్ హనీఫ్ లెఘారీ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో డాక్టర్ ధరమ్ దేవ్ రాతిని మంగళవారం డ్రైవర్ గొంతు కోసి హత్య చేశారు. డాక్టర్ ఇంటిలోనే నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు.

Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. న్యూక్లియర్ ప్లాంట్‌లో నిలిచిన విద్యుత్..

ఇంటికి వెళ్తుండగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు డాక్టర్ వంట మనిషి పోలీసులకు తెలిపారు. వంటగది నుంచి కత్తి తీసుకువచ్చిన డ్రైవర్, వైద్యుడు ధరమ్ దేవ్ ను హత్య చేశారు. హత్య తర్వాత డాక్టర్ కారుతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు డ్రైవర్‌ను ఖైర్‌పూర్‌లోని అతని ఇంట్లో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ధరమ్ దేవ్ రాతి పాక్ హైదరాబాద్ తో ప్రముఖ డాక్టర్.

నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసినందుకు పాకిస్తాన్ మైనారిటీ వ్యవహరాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ పోలీసులను ప్రశంసించారు. అలాగే హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ హత్యను ఖండించారు మరియు ఈ సంఘటనను హృదయ విదారకఘటనగా అభివర్ణించారు. డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా హిందూ సమాజం హోలీ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

Exit mobile version