NTV Telugu Site icon

Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు

Trump

Trump

Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు జనవరి 10వ తేదీన శిక్ష విధిస్తామని న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని సమాచారం. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని చెప్పారు. అయితే, పోర్న్ స్టార్ కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన అభియోగాలను కొట్టి వేసేందుకు న్యూయార్క్ కోర్టు తోసిపుచ్చింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ప్రెసిడెంట్స్ కు రక్షణ ఉంటుందని జడ్జి జువాన్‌ పేర్కొన్నారు. హష్ మనీ కేసు లాంటి వ్యవహారాల్లో ట్రంప్‌కు రక్షణ ఇవ్వలేమన్నారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలారు.. గత ఏడాది నవంబర్‌‌లో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా.. అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో అది వాయిదా పడింది.

Read Also: Tragedy On Vacation: విహారయాత్రలో విషాదం.. బీటెక్ విద్యార్ధి మృతి

ఇక, జనవరి 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా లేదా శిక్ష విధించే సమయంలో హాజరు అయ్యే ఛాన్స్ ఉందని న్యూయార్క్ జడ్జి జువాన్ మోర్చాన్ తెలిపారు. అయితే, ట్రంప్ కు జైలు శిక్ష విధించడం తనకు ఇష్టం లేదని.. షరతులతో కూడిన శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అదే అత్యంత ఆచరణీయమైన పరష్కారం అన్నారు. ఏది ఏమైనా అధ్యక్షుడు ట్రంప్‌కు రిలీఫ్ దొరకడం చాలా అవసరని ట్రంప్ తరపు అడ్వకేట్లు తెలియజేస్తున్నారు. అతనిపై కేసులు ఉంటే పరిపాలన చేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జనవరి 10వ తేదీన ట్రంప్‌కు ఏ రకమైన శిక్ష విధిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Show comments